మెదక్ స్థానం కాంగ్రెస్‌దే..
అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ
నామినేషన్ దాఖలుకు పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు
గుమ్మడిదల టోల్‌గేట్ వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన మంత్రి
పటాన్‌చెరు, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : మెదక్ ఎంపీ స్థానం కాంగ్రెస్‌దేనని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ సందర్భం గా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాట శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో గుమ్మడిదల టోల్‌గేట్‌కు చేరుకున్న నియోజకర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ సైన్యం చూస్తేనే గెలుపు ఎవ్వరిదో ప్రతిపక్ష పార్టీలకు అర్థం అవ్వలన్నారు. మెదక్ ఎంపీగా నీలం మధు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టోల్‌గేట్ వద్ద మంత్రికి నీలం మధు పుష్పగుచ్ఛం అందజేశారు. పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో గుమ్మడిదల టోల్‌గేట్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. కార్యక్రమంలో అసెంబ్లీ కోన్‌నఆర్డినే టర్ శ్యామ్‌గౌడ్, ఐదు మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






