20 May, 2026 | 9:51 PM

ఈత.. జాగ్రత్త

21-04-2024 01:16 AM

ఉత్సాహం మాటున పెను ప్రమాదం

l క్షణాల్లో ముగుస్తున్న జీవితాలు

l చెరువులు, నదుల వద్ద సూచిక బోర్డులు

l పిల్లలపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలి

జహీరాబాద్, ఏప్రిల్ ౨౦ (విజయక్రాంతి) : వేసవి వచ్చిందంటే చాలు.. స్విమ్మింగ్ పూల్‌లు, చెరువులు, నీటి కుంటలు, వాగులు, వంకల్లో ఈత కొడుతున్న దృశ్యలు కనిపిస్తుంటాయి. బడిఈడుకు వచ్చిన చిన్నారులు నుంచి పెద్దల వరకు అందరూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తారు. అయితే సరదా మాటున పొంచి ఉన్న ప్రమాదం గ్రహించకుండా నీటిలో దిగడం వల్ల చాల మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రతి ఏటా ఎంతోమంది విలువైన జీవితాలు నీటిలో కలిసిపోతూ.. వారి తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిలిస్తున్నారు.

ఇలా జరగకుండా తల్లిదండ్రులు పిల్లల కు నీటిపై అవగాహన పెంచాలి. నీటి లోతు తెలియకుండా వాగులు, వంకలు, చెరువుల్లో దిగకుండా చూసుకోవాలి. అప్పుడే ఈత విషాధాన్ని మిగిల్చకుండా సరదా మిగుల్చుతుంది. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్‌కల్, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాల పరిధిలోని గ్రామాల్లో ఉన్న నదులు, చెరువులు, వాగులు, నీటి కుంటల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి..

ఇప్పటికే ఇంటర్, పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఒంటి పూట బడులు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఖాళీగా ఉండే పిల్లలు, యువకులు దగ్గరలోని చెరువులు, నీటి కుంటలు, బావుల, చెక్‌డ్యాంల వద్దకు ఈతకు వెళుతుంటారు. వీరిలో చాలామంది తమకు ఈత రాకపోయినా స్నేహితులు దిగారనో.. ఏమీ కాదు అన్న ధీమాతోనే నీటిలో దిగుతుంటారు. అవే ప్రమాదాలకు కారణమవుతుంటా యి. ఇలా జరగకుండా తల్లిదండ్రులు పిల్లల మీద నిఘా పెట్టాలి. ఈత వచ్చిన వారితోనే పిల్లలను పంపించాలి. తప్పనిసరిగా ట్యూబు లు, లైఫ్ జాకెట్లు, సెఫ్టీ రింగ్ ధరించేలా చూడా లి. ఫిట్స్ ఉన్న పిల్లలను సాధ్యమైనంత వరకు నీటి వద్దకు పంపించకూడదు. కొంతమంది ఈత వచ్చన్న ధైర్యంతో వేగంగా ప్రవహించే కాల్వల్లోకి దూకి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఈత వచ్చినా సరే ఇలాంటివి చేయ కుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సరైన అవగాహన కల్పించాలి.

జాగ్రత్తలు తప్పనిసరి..

అన్ని సౌకర్యాలు ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లో నిపుణులైన శిక్షకుల వద్ద ఈత నేర్పించాలి. చిన్నారులను స్విమ్మింగ్ పూల్ వద్ద ఒంటరిగా వదలకూడదు. పూల్‌లో సెఫ్టీరింగ్స్, రోప్ అందుబాటులో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఫిట్స్, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఈతకు వెళ్లరాదు. వాంతులు, జ్వరం వంటివి ఉన్నప్పుడు స్విమ్మింగ్ చేయకూడదు. పూరాతన బావులు, చెరువుల్లో కర్రలు, రాళ్లు ఉంటాయి, తొందరపడి దూకితే అవిపొడుచుకొని మృతిచెందే అవకాశం ఉంది. సెలవులు ముగిసే వరకు పిల్లలను ఒక కంట కనిపెట్టడం మంచిది. పిల్లలు పోటిపడి కాలువలు, బావుల్లోకి దూకడం, ఒకరినొకరూ నీటిలో ముంచుకోవడం, దాగుడు మూతలు ఆడటం వంటివి చేయకుండా చూసుకోవాలి. నీటి ప్రవాహం అధికంగా ఉన్న చోట ఈత కొట్టరాదు. నడుము లోతు నీరు ఉండి, ప్రవాహం లేని చోట నేర్చుకోవాలి. ఈత కొట్టే సమయంలో వర్షం పడితే బయటకు రావాలి.

పిల్లలపై కన్నేయాలి..

వేసవి వచ్చిందంటే చాలు పిల్లలు ఈత కోసం వెళుతుంటారు. తల్లిదండ్రులు వారిపై నిఘా ఉంచి జాగ్రత్తలు చెప్పాలి. చెరువులు, కుంటలు, నదులు, వాగులు వద్దకు వెళ్లనివొద్దు. ఈత నేర్చుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువులో కాకుండా స్విమ్మింగ్‌పూల్‌లో నేర్పించాలి. ఈత వచ్చిన వారిని కూడా లోతు తెలుసుకోకుండా నీటిలో దిగనివ్వకూడదు. నీటిలో మునిగిన పిల్లలను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లి తడిబట్టలను తీసివేసి సహయం చేయాలి. నీటిలో మునిగిన పిల్లలకు శ్వాస, పల్స్ లేకపోయినా సీపీఆర్ చేయాలి. తర్వాత సమీమంలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లాలి. గ్రామాల సమీపంలోని నదులు, చెరువులు, ప్రమాదకరమైన బావుల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి, అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.

పిల్లలపై పర్యవేక్షణ ఉండాలి

 రామానాయుడు,

ఎస్‌ఐ, హద్నూర్