calender_icon.png 7 June, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంద రోజుల ప్రణాళికలో మేడక చెరువు శుద్ధీకరణ

05-06-2025 12:00:00 AM

మున్సిపల్ కమిషనర్ గణేశ్‌రెడ్డిడ్డి

తూప్రాన్, జూన్ 4 : వంద రోజుల శుద్ధీకరణ ప్రణాళికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తూప్రాన్లోని మేడక చెరువు శుధ్ధీకరణ చేపట్టారు. రాష్ట్రంలోని మున్సిపల్ ప్రాంతాలను నివాస యోగ్యమైన, స్థిరమైన, పర్యావరణ, అనుకూలత పట్టణాల అభివృద్ధి కోసం తూప్రాన్ మున్సిపల్ పరిధిలో ఒక్క అడుగు మార్పు కొరకు అనే నినాదంతో జూన్ 2 నుండి సెప్టెంబర్ 10 వరకు వంద రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య వివిధ అభివృద్ధి.

ప్రణాళికలో భాగంగా తూప్రాన్ కేంద్రంలోని మేడక చెరువు కట్టను శుద్ధికరణ చేసే పనులను ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి నేతృత్వంలో మేడక చెరువు కట్టపైన పిచ్చి మొక్కులను, చెత్తా చెదారాన్ని, జెసిబి సహాయంతో శుభ్రం చేశారు. ఇందులో మున్సిపల్ శానిటేషన్ అధికారులు, సిబ్బందిఉన్నారు.