calender_icon.png 18 January, 2026 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలతో మేడారం ఉత్సవ కమిటీ

18-01-2026 01:38:19 AM

పదవి బాధ్యతల స్వీకరణ 

మేడారం, జనవరి 17 (విజయక్రాంతి): తెలంగాణ కుం భమేళగా గుర్తింపు పొందిన మేడారం సమ్మ క్క సారలమ్మ మహా జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసింది. ఉత్సవ కమిటీలో చైర్‌పర్సన్‌తో పా టు 14 మందికి సభ్యులుగా కమిటీలో అవకాశం కల్పించింది. మునుపెన్నడు లేనివిధంగా ఈసారి పూర్తిగా మహి ళలతో ఏర్పాటు చేయడం విశేషం. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన కమిటీ ప్రతినిధులు శనివారం మేడా రంలో జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు స్వీకరించారు.

చైర్మన్‌గా ఇర్ప సుకన్య, సభ్యులుగా గీకురు భాగ్యలక్ష్మి, మైపతి రచన, సుదిరెడ్డి జయమ్మ, పాయం రమణ, చింత చంద్రకళ, పులుసం పుష్పలత, గుంటోజు పావని, పోడెం రాణి, జనగాం గంగా లక్ష్మి, భూక్య వసం త, ఇజ్జగిరి మమత, గంటమూరి భాగ్యలక్ష్మి సభ్యులుగా నియమితులయ్యారు. వీరితోపాటు వద్దిరాజు విజయలక్ష్మి, పూజా రుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారా వు ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమితులయ్యారు.