18-01-2026 01:40:21 AM
చేగుంట/తూప్రాన్, జనవరి17(విజయక్రాంతి): రూ.22 పాత బాకీ కోసం ఓ కార్మి కుడిని తోటి కార్మికుడు హత్య చేసిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలంలో కలకలం రేపింది. ఈ నెల 15న అనంతసాగర్ వద్ద సిరాజ్(30) అనే వ్యక్తిని మహేష్ కుమార్ బర్మా మద్యం మత్తులో తన బాకీ తీర్చమని గొడవపడి బండరాయి తో మోది హత్య చేశాడు. సిరాజ్ రూమ్మేట్ రవికుమార్ ఫి ర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్టు తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ చెప్పారు.