calender_icon.png 18 January, 2026 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలు

18-01-2026 01:36:58 AM

బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలి

టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కీలక సమావేశం

హైదరాబాద్, జనవరి 17(విజయక్రాంతి) : తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యుల ముఖ్య సమావేశం శనివారం లక్డీకపూల్‌లోని మౌంట్ నాసిర్ భవనంలో ప్రొఫెసర్ మురళీ మనోహర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తీన్మార్ మల్లన్న హాజరై, బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ లక్ష్యాలు, కర్తవ్యాలపై విస్తృతంగా వివరించారు. బీసీ ఉద్యోగులపై జరుగుతున్న అన్యాయాలను సమిష్టిగా ఎదుర్కో వాల్సిన అవసరం ఉందన్నారు. ఫెడరేషన్ తదుపరి కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తూ పలు సూచనలు, సలహాలు అం దించారు. తీన్మార్ మల్లన్న సమక్షంలోనే తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన స్టేట్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ స్టేట్ కమిటీ ఆధా రంగా జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ప్రొఫెసర్లు మురళీ మనోహర్, తిరుమలి ప్రసంగిస్తూ బీసీ ఉద్యోగుల హక్కు ల సాధన కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. సమావే శంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ, బ్యాంకు, హెల్త్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు సమ్మయ్య, వంశీ కృష్ణ, కొట్టే సతీష్, తుల్జారామ్, ప్రొఫెసర్ వేణు తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు ఉద్యోగుల తరపున అల్లం యాదయ్య (వర్కింగ్ ప్రెసిడెంట్), వంశీ కృష్ణ (జనరల్ సెక్రటరీ)లు కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల సంఘం తరపున పాల్గొని తమ అ భిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశానికి సింగరేణి ఉద్యోగులు పెద్ద ఎత్తు న తరలివచ్చారు. ఈ సందర్భంగా వెంకటేష్, నవీన్లు మాట్లాడుతూ, సింగరేణి బీసీ ఉద్యోగుల్లో వచ్చిన చైతన్యాన్ని వివరించారు.

బీసీ ఉద్యోగులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చే శారు. ఎస్సీ, ఎస్టీ లాగానే బీసీలకు కూ డా అట్రాసిటీ యాక్ట్ తీసుకురావాలని, 50 శాతం రిజర్వేషన్ క్యాప్‌పై ఛాలెంజ్ చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఈడబ్ల్యూఎస్ కారణంగా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, వెంటనే బీ సీ సబ్ ప్లాన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అన్ని అం శాలపై న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని, బీసీ ఉద్యో గు ల హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు.