11 March, 2026 | 3:16 PM

Breaking News

గాంధీభవన్‌లో ఆదివాసీ కాంగ్రెస్ కీలక సమావేశం   •   ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక లాభాలు   •   కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •  

హనుమకొండకు మేడారం హుండీలు

03-02-2026 01:37 AM

టీటీడీ కళ్యాణ మండపానికి తరలింపు భారీ బందోబస్తు నడుమ ఆర్టీసీ కార్గో వాహనాల్లో..

మేడారం, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మేడారంలో ఏర్పాటు చేసిన హుండీలను సోమవారం హనుమకొండకు తరలించారు. జనవరి 28 నుంచి 31 వరకు ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా గద్దెల ప్రాంగణం లో ఏర్పాటుచేసిన హుండీలను హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపానికి తరలించారు.

సమ్మక్క గద్దె వద్ద ఏర్పాటుచేసిన 294 హుండీలు, సారలమ్మ గద్దె వద్ద ఏర్పాటు చేసిన 294 హుండీలు, పగిడిద్దరాజు గద్దె వద్ద ఏర్పాటు చేసిన 76, గోవిందరాజు గద్దె వద్ద ఏర్పాటు చేసిన 76, 45 క్లాత్ హుండీలను భారీ బందోబస్తుతో ఆర్టీసీ కార్గో వాహనాల్లో తరలించారు.