calender_icon.png 3 February, 2026 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వేలన్నీ మనవైపే!

03-02-2026 01:45:01 AM

గెలిచే అభ్యర్థులకే బీఫామ్స్ ఇవ్వండి

  1. రెబల్స్ లేకుండా చర్యలు తీసుకోండి
  2. టికెట్లు రాని వారికి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం
  3. పీసీసీ జూమ్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  4. నేడు సాయంత్రం మంత్రులతో సీఎం భేటీ

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో సర్వేలన్నీ మనవైపే ఉన్నాయని, మంచి మెజార్టీతో గెలుస్తామని చెబుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గెలిచే అభ్యర్థులకే బీఫామ్స్ ఇవ్వాలన్నారు. సోమవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ జూమ్ మీటింగ్‌లో సీఎం, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తోపాటు ముఖ్యనేతలు పాల్గొన్నారు.

ఇందు లో మున్సిపల్ అభ్యర్థుల జాబితాకు అధికారికంగా ఆమోదం తెలిపారు. అనంత రం సీఎం మాట్లాడుతూ రెబల్స్ లేకుండా చూసుకోవాలని కాంగ్రెస్ నాయకులకు సీఎం సూచించారు. టికెట్లు రాని బలమైన నాయకులకు కార్పొరేషన్లలో నామి నేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని తెలిపారు. పార్టీ గుర్తులపై ఈ ఎన్నిలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ వీటిని ఛాలెంజ్‌గా తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

టికెట్ కోరే నేతలు తమ అభ్యర్థుల గెలుపు బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క రూ స్థానిక సమస్యలపై లోకల్ మేనిఫెస్టోనూ సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్లాల న్నారు. అభ్యర్థులకు బీఫామ్‌లను అందజేసే బాధ్యత డీసీసీలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నేతలు బీసీ రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించారు.  బీసీలకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్ ఇచ్చేలా కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని కోరారు. 

నేడు మంత్రులతో సీఎం భేటీ..

విదేశీ పర్యటన ముగిసి, నగరానికి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి అప్పుడే పార్టీ, పాలనా వ్యవహారాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆయన మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పార్లమెంట్ ఇన్‌చార్జ్ మంత్రులతో భేటీ కాను న్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొంటారు.

ఈ సమావేశలో రాష్ర్టంలో మున్సిపల్ ఎన్నికలు, పార్టీ బలోపేతం, తాజా రాజకీయాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లే అంశా లు, ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశముంది. ఈ సమావేశానికి హాజరయ్యే ఇన్ చార్జ్ మంత్రులకు తమ పరిధిలోని మున్సిపాలిటీల్లోని సమగ్ర సమాచారంతో హాజరు కావాలని పార్టీ సూచించింది.