1 July, 2026 | 12:56 AM

బీఆర్‌ఎస్‌తోనే మేడ్చల్ జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి

01-07-2026 12:00 AM
  1. ప్రత్యేక ఓటరు నమోదులో కార్యకర్తల కృషి మరువలేనిది    
  2. మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి మహేందర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి  

జవహర్‌నగర్, జూన్ 30 (విజయక్రాంతి): తెలంగాణకు బిఆర్‌ఎస్ పార్టీనే  శ్రీరామరక్ష అని మేడ్చల్ జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి చెందిందని కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి ఇసుమంతైన ముందుకు సాగుతలేదని బిఆర్‌ఎస్ మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డి దుయ్యబట్టారు.

ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియను పురస్కరించుకొని మాజీ మేయర్ మేకల కావ్య బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల ముదిరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం జవహర్ నగర్ లోని 527, 528, 530 బూతులలో బిఆర్‌ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డిలు పలువురు ఓటర్లను కలిసి ఎస్‌ఐఆర్ పై ప్రత్యేక అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఓటు మానవుడికి వజ్రాయుధం లాంటిదని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి పౌరుడు పొందాలని పిలుపునిచ్చారు. ఓటర్ నమోదులో బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు కృషి అభినందనీయమని మేడ్చల్ జిల్లాను సర్ ప్రక్రియలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని అన్నారు. అనంతరం కాలనీలో పర్యటించి ఓటర్ నమోదును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిట్టా శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ చారి, ప్రసాద్, భాస్కర్, మహేష్, శోభారెడ్డి, మంజుల, బిఆర్‌ఎస్ శ్రేణులు బిఎల్వోలు తదితరులు  పాల్గొన్నారు.