కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
01-07-2026 12:00 AM
గాంధారి, జూన్ 30 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో గల రైతువేదికలో 39 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసినట్టు స్థానిక తహసిల్దార్ రేణుకా చౌహాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తూర్పు రాజులు, ఎండ్రాల గోపాల్, బొమ్మని బాలయ్య, అహ్మద్ , గడ శంకర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంగని బాబా, బల్వంత్ రావ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.






