5 August, 2026 | 10:05 PM

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

05-08-2026 09:30 PM

డీఎంహెచ్‌వో డాక్టర్ మధుసూదన్

భూపాలపల్లి/ మొగుళ్లపల్లి,(విజయక్రాంతి): వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ సూచించారు. బుధవారం మొగుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పలు ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది హాజరు, వైద్య రికార్డులను పరిశీలించారు.

అనంతరం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి జ్వరాలపై నిరంతర నిఘా ఉంచాలని, అనుమానిత కేసులను వెంటనే గుర్తించి చికిత్స అందించాలని సూచించారు. చిన్నారుల టీకాల కార్యక్రమాన్ని సమీక్షించిన ఆయన, ప్రభుత్వ ఆరోగ్య సేవలను ప్రజలకు నాణ్యంగా అందించేలా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ నాగరాణి తదితరులు పాల్గొన్నారు.