తాండూరులో విషాదం.. భవనం పైనుంచి పడి చిన్నారి మృతి
05-08-2026 12:36 PM
తాండూరు: వికారాబాద్ జిల్లా(Vikarabad) తాండూరులోని గాంధీనగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసకుంది. భవనం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి 18 నెలల చిన్నారి మృతి చెందింది. అందిన సమాచారం ప్రకారం, ఆ చిన్నారిని దీక్షితగా గుర్తించారు. ఆమె ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






