5 August, 2026 | 1:26 PM

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ ఎల్లయ్య

05-08-2026 12:54 PM

అశ్వాపురంలో అవగాహన సదస్సు నిర్వహణ

అశ్వాపురం, ఆగస్టు 5 (విజయక్రాంతి): రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అశ్వాపురం సీఐ సీహెచ్. ఎల్లయ్య సూచించారు. బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సైబర్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ అపరిచితుల ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులను నమ్మవద్దని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వొద్దని హెచ్చరించారు. ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసి సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ముత్యాలరావు, సర్పంచ్ బానోత్ సదర్‌లాల్, ఉపసర్పంచ్ తుళ్లూరి ప్రకాష్‌రావు, పంచాయతీ కార్యదర్శి యాకూబ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.