18 April, 2026 | 11:36 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

విజయవంతంగా ముగిసిన వైద్య శిబిరం

12-04-2025 01:13 AM

ఖమ్మం  ఏప్రిల్ 11( విజయక్రాంతి ):- ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్త మేడిపల్లి గ్రామంలో పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ - ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఉచిత వైద్య శిబిరం శుక్రవారం విజయవంతం అయింది... ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా స్థానిక కొత్త మేడేపల్లి కోయ సామాజిక ప్రజలు 180 మందికి వైద్య పరీక్షలు చేసి అందరికి ఉచితంగా మెడిసిన్ పంపిణి చేశారు. 

ఈ నేపథ్యంలో ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ డైరెక్టర్ జయరాజ్ మాట్లాడుతూ... కొత్తమేడేపల్లి ప్రజలకు వైద్య సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందని, ఈ గ్రామానికి మేము రావడానికి మూలకారణమైన పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డా. పీటర్ నాయక్ లకావత్ వారికి అన్ని విధాలుగా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సి.కే. న్యూస్ చైర్మన్ భూక్యా ఉపేందర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా పీటర్ నాయక్ మాట్లాడుతూ.. అడిగిన వెంటనే వచ్చిన హ్యాండ్ ఆఫ్ హోప్ డైరెక్టర్ జయరాజ్ కి , వైద్య బృంధానికి పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో  హ్యాండ్ ఆఫ్ హోప్ డైరెక్టర్ జయరాజ్, పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా. పీటర్ నాయక్ లకావత్, జాన్ లకావత్, సి.కే. న్యూస్  చైర్మన్ భూక్యా ఉపేందర్, భూక్యా లక్ష్మి, సికే. న్యూస్ స్టాఫ్ మౌనిక, సి.కే. న్యూస్ స్టాఫ్ బాలు తదితరులు పాల్గొన్నారు.