11 August, 2026 | 6:27 PM

విద్యార్థుల‌కు వైద్య ప‌రీక్ష‌లు

11-08-2026 05:48 PM

మునిప‌ల్లి,(విజయక్రాంతి): ఆర్‌బీఎస్‌కే మొబైల్ హెల్త్ టీం ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం మండ‌లంలోని బుదేరా ప్రైమ‌రి స్కూల్ లో చ‌దువుతున్న విద్యార్థుల‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈసంద్భంగా విద్యార్థులకు హిమోగ్లోబిన్,  దంత, ఈఎన్ టీ త‌దిత‌ర  పరీక్షలను  డాక్టర్ గౌరి శంకర్ డాక్టర్ మెహనాజ‌న్ చేసి  త‌గు సూచ‌న‌లు, స‌ల‌హాలు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంఈఓ భీంసింగ్ పాల్గొని  మాట్లాడారు. విద్యార్థుల‌కు ముంద‌స్తుగా  వ్యాధులు రాకుండా ఉండేందుకు ఈ వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో  సంయుక్త  ఫార్మ‌సిస్ట్ డి. సంయుక్త,   సిబ్బంది  వరలక్ష్మి,  పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. సురేందర్,  ఉపాధ్యాయులు అశోక్, గోపాల్  విద్యార్థులు పాల్గొన్నారు.