11 August, 2026 | 6:22 PM

కోలారి బ్రిడ్జి మరమ్మతు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

11-08-2026 05:50 PM

బజార్ హత్నూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని కోలారి గ్రామం వద్ద గల ప్రధాన బ్రిడ్జి వర్షపు నీటితో బురదగా మారడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే మరమ్మతులు చేపట్టారు. జరుగుతున్న పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు. ఎం ఎల్ ఏ వెంట సర్పంచ్ సాయినాథ్, ఉప సర్పంచ్ రియాజ్, నెరడిగొండ మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచుల సంఘం అధ్యక్షులు స్వామి, శ్రీధర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.