24 June, 2026 | 1:04 AM

మొగుళ్ల రాజిరెడ్డిని అభినందించిన మీనాక్షి నటరాజన్

24-06-2026 12:11 AM

ఐఎన్టీయూసీకి  కాంగ్రెస్ పార్టీతో విడదీయరాని బంధం ఉంది

కార్మికుల, శ్రేయస్సు, సంక్షేమం కోసం పని చేయాలి

ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్

ముషీరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ఐఎన్టీయూసీకి  కాంగ్రెస్ పార్టీతో విడదీయరాని బంధం ఉందని, కాంగ్రెస్ పార్టీ బలోపితానికి ఐఎన్టీయూసీ దేశవ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తుందని, ఐఎన్టీ యూసీ బలంగా ఉంటేనే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందని, ఐఎన్టీయూసీ నేతలు ఎల్లప్పుడు కార్మికుల, శ్రేయస్సు, సంక్షేమం కోసం పని చేయాలని ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కోరారు.

ఇటీవలే జలమండలి గుర్తింపు సంఘం ఎన్నికల్లో భారీ మెజారిటీతో తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులుగా విజయం సాధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డిని హైదరాబాద్ హైదర్ గూడ ఓల్ ఎమ్యెల్యే క్వార్టర్స్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో శాలువా, పుష్పగుచ్ఛం అందజేసి మీనాక్షి నటరాజన్ అభినందించారు.

ఈ సందర్బంగా మీనాక్షి నటరాజన్  మాట్లాడుతూ కార్మికుల హక్కులు,  గౌరవాన్ని పరి రక్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూరదృష్టితో చేపట్టిన కార్యక్రమం ’శ్రమిక్ న్యా య్‘అని తెలిపారు. ఇందులో భాగంగానే సంఘటిత, అసంఘటిత కార్మికులను ఏకం చేసి కనీస వేతనాలు, ఉద్యోగ, ఆరోగ్య భద్రతకై ఉద్యమాలు చేసి ఉద్యోగ, కార్మికుల సామాజిక-ఆర్థిక సమానత్వాన్ని ప్రోత్సహించాలని అన్నారు.

ఐఎన్టీయూసీ మొగుళ్ళ రాజిరెడ్డి మాట్లాడుతూ జలమండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తన విజయానికి సహకరించిన ప్రతి ఉద్యోగి, కార్మికుడి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జలమండలి ఎన్నికల ఇన్చార్జ్గా వ్యవహరించిన మాజీ మేయర్  బొంతు రామ్మోహన్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.డి. చంద్రశేఖర్, టీజెఈయు ప్రధాన కార్యదర్శి టి.పి. రాఘవేంద్ర రాజ్, అసోసియేట్ ప్రెసిడెంట్ అల్లి శ్రవాన్ కుమార్, మేవ ప్రధాన కార్యదర్శి సయ్యిద్ అక్తర్ అలీ, నేతలు సి. రాజు, సిహెచ్. ప్రవీణ్ కుమార్, మజారుద్దీన్, తిరుపతి, బి. మహేష్ పాల్గొన్నారు.