10 August, 2026 | 10:06 PM

వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెలతాడు చోరీ

10-08-2026 08:56 PM

లక్కారంలో ఘటన విచారం చేపట్టిన మంథని సీఐ స్వామి

ముత్తారం,(విజయక్రాంతి): ఇంటి బయట నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు పుస్తెలతాడు అపహరించిన ఘటన ముత్తారం మండలం లక్కారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బర్ల లక్ష్మి (80) ఇంటి బయట నిద్రిస్తుండగా, ఆమె భర్త బర్ల మొగిలి భార్యతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నారు.

అర్ధరాత్రి సమయంలో ఇంటి బయట తలుపులకు బెడం వేసిన గుర్తుతెలియని వ్యక్తులు, నిద్రిస్తున్న లక్ష్మి మెడలోని సుమారు రెండు తులాల పుస్తెలతాడును అపహరించి అక్కడి నుంచి పరారైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం ఘటనను గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మంథని సీఐ బుద్ధె స్వామి. ఎస్ఐ రవికుమార్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీఐ ఆధ్వర్యంలో  కేసు వివరాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. గ్రామంలో జరిగిన చోరీతో స్థానికంగా ఆందోళన నెలకొంది.