15 July, 2026 | 9:04 PM

గుడిబండలో బీఎల్వోల సమావేశం

15-07-2026 09:03 PM

కోదాడ,(విజయక్రాంతి): గుడిబండ గ్రామ పంచాయతీలో కోదాడ ఎంపీడీఓ ఇసాక్ హుసేన్ ఆధ్వర్యంలో బుధవారం బీఎల్ఓల సమావేశం నిర్వహించచారు. ఎంపీడీఓ ఇసాక్ హుసేన్ మాట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమం ఇప్పటివరకు ఎంత మేరకు పురోగతి సాధించిందో అడిగి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు. అలాగే ఓటరు నమోదు ప్రక్రియను అత్యంత బాధ్యతతో, పారదర్శకంగా నిర్వహించాలని, ప్రతి అర్హుడైన ఓటరును నమోదు చేసేలా కృషి చేయాలని బీఎల్ఓలకు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విధులను నిబద్ధతతో నిర్వహించి, ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.