ఘనంగా చైతన్య స్కూల్‌లో విద్యార్థి నాయకుల ఎన్నికలు
తూప్రాన్,(విజయ క్రాంతి): శ్రీ చైతన్య స్కూల్ లో ప్రజాస్వామ్య విలువలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు విద్యార్థి నాయకుల ఎన్నికలను ఉత్సాహ భరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో విద్యార్థులు క్రమశిక్షణతో, ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో కొంపల్లి జోన్ ఏజీఎంకె. శ్రీనివాస్ రావు, జోనల్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ లు ఉన్నారు,
ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల దాఖలు, ప్రచారం, రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ వంటి అన్ని దశలను పారదర్శకంగా నిర్వహించారు. ఎన్నికల ద్వారా స్కూల్ క్యాప్టెన్, వైస్ క్యాప్టెన్, స్పోర్ట్స్ క్యాప్టెన్, డిసిప్లిన్ క్యాప్టెన్, కల్చరల్ క్యాప్టెన్ తదితర విద్యార్థి నాయకులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతా యుతమైన ఆలోచన, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించడమే ఈ ఎన్నికల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి అవసరమైన అనుభవం లభిస్తుందని పేర్కొన్నారు.






