5 May, 2026 | 5:40 PM

కేసీఆర్‌తో బీసీ కమిషన్ మాజీ సభ్యుల భేటీ

14-09-2024 02:41 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావును శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కిశోర్‌గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. బీసీ కమిషన్ సభ్యులుగా అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించారని కేసీఆర్ వారిని అభినందించారు. రానున్న రోజుల్లో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ వారికి భరోసానిచ్చారు.