వైద్య రంగంలో సామాజిక సేవ ఉండాలి
10-07-2026 01:02 AM
నిర్మల్, జులై 9 (విజయక్రాంతి): వైద్య రంగంలో పేద రోగుల పట్ల సామాజిక సేవ ఉన్నప్పుడే మంచి గుర్తింపు వస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ కేంద్రంలో నూతన కేబీ హోమియోకేర్ హాస్పిటల్ ప్రారంభించారు. హోమియోపతి వైద్య రంగంలో వస్తున్న మార్పులను ప్రజలకు వివరించాలని సూచించారు.
వైద్యులు సృజన్ దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కొత్తపల్లి గంగామణి బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మాజీ రాజేందర్ అప్పల గణ చక్రవర్తి నాళం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.






