28 July, 2026 | 1:11 PM

Breaking News

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •  

నేటి నుండి జరుగు గ్రామసభల ప్రాముఖ్యతపై సమావేశం

01-04-2026 07:28 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో దివ్య దర్శన్ రావు అధ్యక్షతన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 2న సుల్తానాబాద్ మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో  జరగబోయే గ్రామ సభలు, వాటి ప్రాముఖ్యత, సెన్సస్ సర్వే అంశాలపై ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఇట్టి గ్రామసభలలో గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, వాటి వివరాలు ప్రజలకు తెలియజేయడము, గ్రామాలలో ఉన్న అవసరాలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడం మొదలగు వాటిపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని గ్రామ సభలను విజయవంతం చేయవలసిందిగా తెలపడం జరిగింది. గ్రామ సభల నిర్వహణ మరియు జన గణన  సర్వేలో పాటించవలసిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్థానిక తహసిల్దార్  బషీరుద్దీన్, మండల విద్యాధికారి రాజయ్య , మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.