28 July, 2026 | 1:47 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

పౌల్ట్రీ పరిశ్రమను కాపాడాలి

01-04-2026 07:30 PM

మిర్యాలగూడ,(విజయక్రాంతి): నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఏర్పాటు చేసుకున్న పౌల్ట్రీ పరిశ్రమ పౌల్ట్రీ కార్పొరేషన్ కంపెనీ విధానాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున తమకు తగిన న్యాయం చేయాలని కోరుతూ బుధవారం పట్టణంలోని చికెన్ షాప్ ల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా షాప్స్ ఓనర్స్ అండ్ ట్రేడర్స్  సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రాంబాబుల ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం బైక్ ర్యాలీ నిర్వహించి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణన్ అమిత్ మాలెంపాటికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌల్ట్రీ కార్పొరేషన్ విధానాలతో తాము తీవ్రంగా  నష్టపోతున్నామని తమకు తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పేలపోలు శ్రీనివాస్, రియాజ్ భాయ్,తిరుమలరావు, షఫీ, శ్రీధర్,శ్యామ్ తదితరులున్నారు.