కోదాడలో 19న మెగా జాబ్‌మేళా

15-09-2026 | 10:23pm

మోతె,(విజయక్రాంతి): నిరుద్యోగ యువత(Unemployed youth)కు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 19న కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి స్కూల్‌లో మెగా జాబ్‌మేళా(Mega job fair) నిర్వహించనున్నట్లు మోతె తహసీల్దార్ వెంకన్న(Mote Tahsildar Venkanna) తెలిపారు. సుమారు 200 నుంచి 250  కంపెనీలు జాబ్‌మేళాకు హాజరై అర్హులైన అభ్యర్థులను వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు.

ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఐటీఐతో పాటు ఆయా ఉద్యోగాలకు అవసరమైన విద్యార్హతలు ఉన్న నిరుద్యోగ యువత జాబ్‌మేళాకు నేరుగా హాజరై ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చన్నారు. పెద్ద సంఖ్యలో కంపెనీలు ఒకే వేదికపై అందుబాటులో ఉండటంతో యువతకు ఉద్యోగం పొందే మంచి అవకాశం లభించనుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ వెంకన్న కోరారు.

మరిన్ని వార్తలు