కోదాడలో 19న మెగా జాబ్ మేళా

16-09-2026 | 04:10am

300 కంపెనీలు,-- 3,500 పైగా ఉద్యోగావకాశాలు

ఒకే వేదికపై అభ్యర్థులకు 5 సంస్థల్లో ఇంటర్వ్యూలు

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చేతుల మీదుగా ఆఫర్ లెటర్లు

అధికారులతో సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్

సూర్యాపేట, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని విద్యావంతులై న నిరుద్యోగ యువతకు, ప్రముఖ పారిశ్రామిక సంస్థలకు మధ్య బలమైన అనుసంధా నం కల్పించే లక్ష్యంతో ఈ నెల 19న కోదాడలో ప్రతిష్టాత్మకంగా మెగా జాబ్ మేళా(Mega Job Mela) నిర్వహిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy) తెలిపారు.

సూర్యాపేట కలెక్టరేట్‌లో మంగళవారం జాబ్ మేళాపై అధికా రులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పలు వివరాలను వెల్లడించా రు. ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, ఐటీఐ తదితర వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన గ్రామీణ యువతకు ఉద్యోగ సమాచారం అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇంటర్వ్యూలకు హాజరుకావడం ఆర్థికంగా భారంగా మారుతోందని పేర్కొన్నారు. అంతరాన్ని తొలగిం చేందుకే అపోలో, జీఎంఆర్, రాంకీ, మహీ్ంర దా వంటి 300 ప్రముఖ కంపెనీలను నేరుగా గ్రామీణ యువత ముంగిటిలోకి తీసుకువస్తున్నామని తెలిపారు.

ఈ జాబ్ మేళా ద్వారా 3,500 మందికి పైగా యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయన్నారు. అంతేకా కుండా ప్రతి అభ్యర్థికి సులభంగా ఐదు సంస్థల్లో ఇంటర్వ్యూలు ఎదుర్కొనేలా ఏర్పా ట్లు చేశామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆఫర్ లెటర్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే లక్షన్నర మందికి పైగా బల్క్ సందేశాలు, క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను ముమ్మరం చేశామన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు,పంచాయతీ కార్యదర్శులు, గ్రామ, మండల స్థాయి అధికారులు తమ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతను గుర్తించి జాబ్ మేళా సమాచారంను బాధ్యతగా అందించాలన్నారు. అనంతరం జాబ్ మేళా ఆర్గనైజేషన్ కమిటీ చైర్ పర్సన్, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు గల, 10 వ తరగతి పైన విద్య అర్హత వున్న వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు