30 March, 2026 | 9:50 PM

గట్లమల్యాలలో మెగా వైద్య శిబిరం

30-03-2026 08:12 PM

రోగులకు ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ

నంగునూరు,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గట్లమల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి సిద్దిపేట ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుంచి వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు రోగులకు వైద్య సేవలు అందించారు. శిబిరానికి వచ్చిన 162 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను పంపిణీ చేశామని వైద్యాధికారులు డాక్టర్ విపిన్, డాక్టర్ శివకుమార్ లు తెలిపారు.

వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సుమారు 53 మందిని తదుపరి మెరుగైన చికిత్స కోసం పై ఆసుపత్రులకు రిఫర్ చేశామన్నారు. గ్రామ సర్పంచ్ ఇంగె నరేష్, ఉపసర్పంచ్ తిప్పని శ్రీనివాస్ ఈ వైద్య శిబిరాన్ని సందర్శించి, ప్రజలకు అందుతున్న చికిత్సలను పరిశీలించారు. గ్రామీణ ప్రజలకు నిపుణులైన వైద్యులతో తనిఖీలు చేయించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ శిబిరంలో ఎంపిహెచో కనకయ్య, హెడ్ నర్స్ అరుంధతి, ఆరోగ్య పర్యవేక్షకులు లిటిల్ ఫ్లవర్, పద్మబాయిలతో పాటు స్టాఫ్ నర్సులు, హెల్త్ అసిస్టెంట్స్, ఏయన్ఎంలు, ఆశా కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది పాల్గొని తమ సేవలను అందించారు.