30 March, 2026 | 9:42 PM

చదరంగం పోటీల్లో ప్రతి చాటడం అభినందనీయం

30-03-2026 08:08 PM

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అజామొహినుద్దీన్

జవహర్ నగర్,(విజయక్రాంతి): అంతర్జాతీయ స్థాయి చదరంగం పోటీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ప్రతిభ చాటడం అభినందనీయమని బాలాజీ నగర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అజా మొయినుద్దీన్ అన్నారు. జవహర్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అనిల్ చదరంగం పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటినందుకు సోమవారం పాఠశాల బృందం అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అజా మొయినిద్దీన్ హాజరై మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటినుండే చదువుతోపాటు క్రీడల వైపు దృష్టి సారించాలని అన్నారు. 3 వ మహారధి ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ ఫైడ్ రేటెడ్ చెస్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన పోటీల్లో బోయిని అనిల్ 9 రౌండ్ల లోనే ఐదు పాయింట్లు సాధించి ప్రత్యేకతను కనబరచాడు. భవిష్యత్తులో అనిల్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.