calender_icon.png 17 July, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్డి(బీ)లో మెగా వైద్య శిబిరం

14-07-2025 12:24:14 AM

కుభీర్, జూలై ౧౩ (విజయక్రాంతి): పేదల కు విద్య, వైద్యం ఉచితంగా అందినప్పుడే రా ష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నా రు. ఆదివారం నిర్మల్ జిల్లా కుభీరు మండ లం పార్డి (బి) గ్రామంలో బైంసా డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాలలో పేదలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్యం అందించడంతో పాటు వారిలో మనోధైర్యాన్ని నింపుతున్న డాక్టర్లు అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమంలో రాజరా జేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షులు వాంకడే మోహన్, చిమ్మ న్ పోశెట్టి, బిజ్జం సంతోష్, చిమ్మన్ రవి, చంద్రశేఖర్, బ్యారపు కానోబా, డాక్టర్ నగేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.