14-07-2025 12:25:40 AM
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి
మంచిర్యాల, జూలై 13 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులకు 2023, జూలై 1 నుంచి బకాయి ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వైద్య శాంతికుమారి కోరారు. ఆది వారం టీఎస్యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు.
పిఆర్సి ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడిచినా నివేదిక వెలువరించక పోవడం అన్యాయమన్నారు. వెంటనే పిఆర్సి నివేదికను బహిర్గత పరిచి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ తో వెంటనే అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న డిఏలను మంజూరు చేయాలని, పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, పెండింగ్ లో ఉన్న రిటైర్మెంట్ అయినా ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుండారపు చక్రపాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజావేణు, జిల్లా ఉపాధ్య క్షులు వి. కిరణ్ కుమార్, జిల్లా కోశాధికారి బి కిరణ్ జిల్లా కార్యదర్శిలు కె చంద్రమౌళి, జి నర్సయ్య, జిల్లా కమిటీ సభ్యులు టీ రమేష్, తిరుపతి, అశోక్, రమేష్, జైపాల్, దేవయ్య, పోచన్న అన్ని మండలాల బాధ్యు లు పాల్గొన్నారు.