5 May, 2026 | 9:59 AM

ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. ఆదుకోండి

02-09-2024 03:22 PM

హైదరాబాద్‌: రాష్ట్రంలో వరదలు అస్తవ్యస్తంగా మారాయని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి, ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం కింద తక్షణ సాయం అందించాలని బీఆర్‌ఎస్ సీనియర్ నేత టీ హరీశ్ రావు  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంట్లో వరద నీరు, కంట్లో ఏడతెగని కన్నీరు. వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు, కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోవడం పై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలని డిమాండ్  చేశారు. ఇప్పటికే తక్షణ సహాయ చర్యలు అందలేదని జనం తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని సూచించారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా మనసుపెట్టి చర్యలు తీసుకోవాలి వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని హరీశ్ రావు కోరారు. విద్యుత్ సరఫరాను పునర్దరించాల్సిన చోట వేగంగా చర్యలు తీసుకోవాలి. ఆహారం నీరు అందుబాటులో ఉంచాలన్నారు. అసలే రాష్ట్రం విష జ్వరాలతో విలువిలలాడుతున్నది. వరదల వల్ల మరింత విజృంబిచే ప్రమాదం ఉందన్న హరీశ్ రావు అన్ని శాఖలు అప్రమత్తం కావాలన్నారు.