calender_icon.png 10 January, 2026 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేఘన ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ చేయూత

09-01-2026 12:00:00 AM

భీమదేవరపల్లి, జనవరి 8 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో అనారోగ్యానికి గురైన పలువురికి మేఘన ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు సుహాసిని గురువారం ఆర్ధిక సాయంతో పాటుగా పండ్లు కోడి గృడ్లుఅందించారు. వంగర గ్రామంలో అనారోగ్యానికి గురైన రజనీకాంత్ కుమారుడు చింటూ కు రూ. 20 వేలు, మల్లమారి శ్రీనివాస్ కు రూ. 10వేలు బత్తినీ రాజయ్య కు రూ.2500, రోడ్డ కొమురమ్మ కి రూ. 2500 అందించినట్లు సుహాసిని తెలిపారు. ఈ సందర్భంగా మేఘన ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు సుహాసిని మాట్లాడుతూ పేదకుటుంబాలకు చెందిన వారు అనారోగ్యానికి గురి కావడంతో  వారికి కాసింత అండగా నిలవలనే ఉద్దేశంతో తమ సొసైటీ ఆధ్వర్యంలో వారికి వైద్య ఖర్చులతో పాటుగా పండ్లు అందించినట్లు తెలిపారు.