09-01-2026 12:00:00 AM
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ములుగు, జనవరి 8 (విజయక్రాంతి): యువత తమ క్రీడా ప్రతిభను కనబరచడానికి సీఎం కప్ పోటీలు సువర్ణ అవకాశమని ఈ పోటీలను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అన్నారు గురువారం ములుగు జిల్లా కలెక్టరేట్ లో సీఎం కప్ రెండవ ఎడిషన్ టార్చ్ ర్యాలీ ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి క్రీడాకారులలో ప్రతిభను వెలికి తీయడం కోసం సీఎం కప్ రెండవ ఎడిషన్ సరైన వేదిక అని ఈ అవకాశాన్ని గ్రామీణ స్థాయి యువత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.