09-01-2026 12:00:00 AM
-సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ
వెంకటాపూర్, జనవరి 8 (విజయక్రాంతి): విద్యార్థులకు ఎల్లప్పుడూ నాణ్యమైన భోజనం అందించాలని గ్రామ సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజన పథకాన్ని గ్రామ సర్పంచ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటారని, అందువల్ల వారికి అందించే భోజనం నాణ్యతతో ఉండాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజు, ఎన్‌ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి కోటి, అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మెన్ ఫరీనా, రమేష్, వార్డు సభ్యులు బానోతు సునీల్, నల్ల కోటి, కాంగ్రెస్ మండల నాయకులు జాకీర్, అన్నెవేన శ్రావణ్, యుగేందర్, బుస్సా గణేశ్, బానోతు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.