యోగాతో మానసిక ప్రశాంతత ఆరోగ్యం
15-07-2026 04:13 PM
బోథ్,(విజయక్రాంతి): యోగాతో ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఉంటుందని ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి మాధవి, డిఆర్డిఓ రాథోడ్ రవీందర్లు పేర్కొన్నారు. బుధవారం సోనాల మండల కేంద్రంలో యోగా ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు యోగాను ప్రతి దినం అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి మమ్మద్ హుస్సేన్, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సచిన్, ఏఏపిసి చైర్మన్ గాజుల లక్ష్మి, అధ్యాపకులు ప్రసాద్, సంతోష్, ప్రతాప్, రమేష్, చందర్, చంద్రకాంత్, శేఖర్, ప్రవీణ్, ఆనంద్, యోగ శిక్షకురాలు మునిగల యోగిత పాల్గొన్నారు.






