30 June, 2026 | 8:59 PM

Breaking News

పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •  

ఆధ్యాత్మికతో మానసిక ప్రశాంతత

27-02-2026 01:10 AM

బాలబ్రహ్మచారి శ్రీ వెంకటస్వామి మహారాజ్

కుభీర్, ఫిబ్రవరి 26: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి (కె) గ్రామంలో గురువారం నూతనంగా నిర్మించిన శ్రీ విఠలేశ్వర ఆలయంలో విట్టల రుక్మిణి విగ్రహాల ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట, శిఖర స్థాపన, ధ్వజారోహణ, యజ్ఞ హోమాది కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ కన్నుల పండుగగా సాగింది. బుధవారం రాత్రి షాపూర్ కు చెందిన శ్రీ పరమేశ్వర్ మహారాజ్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కీర్తన కార్యక్రమం కొనసాగింది.

భైంసా పట్టణానికి చెందిన ప్రముఖ వేద పండితుడు శ్రీ భబ్రు మహారాజ్  ఆధ్వర్యంలో వేద పండితుల బృందం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ స్థానిక సర్పంచ్ బందెల గంగామణి, బందెల సత్యనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షులు దుంపటి రాములు, గజ్జరాం, భైంసా మున్సిపల్ చైర్మెన్ తూము దత్తాత్రి, బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులు,

మాజీ స్టేట్ మార్క్ఫెడ్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, గడ్డిగారి విట్టల్ రెడ్డి, మాజీ ఎంపీపీలు బోయిడి విట్టల్, ఏఎంసి చైర్మన్ గోనె కల్యాణ్, ఆత్మ చైర్మన్ సిద్ధంవార్ వివేకానంద, సింధే చంద్రశేఖర్ పటేల్, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు తోకల మారుతి, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.