30 June, 2026 | 7:53 PM

Breaking News

మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పలు దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు   •   పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు   •   ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలి   •   సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం   •   చిన్న గాలి వానోస్తే కరెంటు గల్లంతే   •   మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   రామేశ్వరపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం   •   ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి యువకుడు మృతి   •   మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

నార్నూర్ మండలంలో కేంద్ర బృందం ప్రతినిధులు

27-02-2026 01:09 AM

ఉట్నూర్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం నిధులతో నార్నూర్ మండలంలో చేపట్టిన నీటి పొదుపు పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ బృందం అధికారి అనిక క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలాన్ని నార్నూర్ బ్లాక్‌గా ఎంపిక చేసి ప్రత్యేక నిధులను కేటాయించారు. నార్నూర్ బ్లాక్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో కలెక్టర్ రాజర్శి షా ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టారు. నార్నూర్ బ్లాక్ అభివృద్ధికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ రాజర్శి షా జాతీయ స్థాయిలో రెండు సార్లు అవార్డులు పొందారు.

కలెక్టర్ అవార్డులు పొందిన నార్నూర్ బ్లాక్ అభివృద్ధికి చేస్తున్న ప్రత్యేక కృషిని మరోసారి పరిశీలించుటకు కేంద్ర ప్రభుత్వ పరిశీలన బృందం ప్రతినిధి అనిక గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా గ్రామాల రైతులతో జరుగుతున్న అభివృద్ధి పనులపై వివరంగా తెలుసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎప్పటి కప్పుడు డి.ఆర్.డి.ఓ  పిడి  రవీందర్ రాథోడ్ తో పాటు ఎంపీడీవో పర్యవేక్షణ చేస్తున్నారని బృందం సభ్యులకు వివరించారు. కేంద్ర కమి టీ బృందంతో పాటు డి.ఆర్.డి.ఓ పిడి రవీందర్ రాథోడ్, ఎంపీడీవో పుల్లారావు, జిల్లా రాయి సెం టర్ల  మాజీ జిల్లా మేడి మెస్రం దూర్గులతో పాటు రైతులు, అధికారులు పాల్గొన్నారు.