calender_icon.png 12 October, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెంటల్ వెల్నెస్ కార్యక్రమం

12-10-2025 07:26:10 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెంటల్ వెల్ నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మధుమలాంఛ డిగ్రీ కళాశాల రిటైర్డు ప్రిన్సిపల్ యార్లగడ్డ శ్రీనివాస్ పాల్గొని బీర్కూర్ మహాత్మా జ్యోతి పులే స్కూల్ లో పిల్లలను దృష్టిలో ఉంచుకొని వారికి.. స్కూల్ పిల్లల భవిష్యత్తు కార్యాచరణ, క్రమశిక్షణ, నిర్వహించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి తండ్రి మనకోసం ఎంత వరకు చేశారు, మనం తల్లి తండ్రి కోసం ఏం చేస్తున్నాం, భవిష్యత్తులో మనం ఏలా ఉండాలి, అనే దాని పై చదువులు, ఉద్యోగాలు గురించి వివరణ అన్వేషణ, ప్రయోగాలు, సమస్యలు పరిష్కారం, జ్ఞానం సామర్థ్యాలు, సృజనాత్మక కృత్యాలు, నైపుణ్యాలు ఆటలు, క్రీడల గురించి మెంటల్ వెల్ నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

అనంతరం యార్లగడ్డ శ్రీనివాస్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సితలె రమేష్, సేకరెట్రి జెట్టి రవీందర్ , ట్రైజరర్ మేకల గాలయ్య ,జోన్ ఛైర్మెన్ కోట్టురి సంతోష్, సీనియర్ లయన్స్ సభ్యులు MA రషిద్ ,కిషోర్ దాస్,మేకల విఠల్ ,లయన్స్ సభ్యులు కొర్రి అశోక్ యాదవ్ ,పెండ్యాల రమేష్ ,సాయికృష్ణ ,సుధాకర్ రెడ్డి , బస్వంత్ పటేల్ ,కార్తీక్ పటేల్ పాల్గొన్నారు.