14 July, 2026 | 6:46 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్

14-06-2026 03:19 PM

హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సంజయ్, దాసోజ్ శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ప్లాఫ్ అయిందని, గత రెండున్నర ఏళ్లలో రేవంత్ రెడ్డి సర్కార్ వేలాడి మంది ఇళ్లను కూల్చిందని పేర్కొన్నారు. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని, మీనాక్షి నటరాజన్ కు వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డే అని కేటీఆర్ తెలిపారు. ఖైరతాబాద్ లో త్వరలో ఉపఎన్నిక వస్తోందని, గరీబోళ్ల ఆకలి తెలిసిన వ్యక్తి నేత కేసీఆర్ అని, కేవలం రూ. 5/- లకే కడుపునిండా భోజనం అందించేలా ‘అన్నపూర్ణ క్యాంటీన్లు’ పెట్టించి లక్షలాది మంది పేదల కడుపు నింపిన అన్నదాత అని గుర్తు చేశారు. కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు, కానీ ముందు మహిళలకు నెలకు ఇస్తామన్న రూ.2,500 బాకీతో సహా ఇవ్వు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.