calender_icon.png 12 October, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రదీప్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వివేక్

12-10-2025 07:33:01 PM

అర్మూర్ (విజయక్రాంతి): ప్రముఖ అంబేద్కర్ వాది, ఉస్మానియా యూనివర్సిటీ జాక్ అధ్యక్షుడు, అంసా రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్ ను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట స్వామి(Minister Vivek Venkataswamy), వర్ధన్నపేట ఎమ్మెల్యే నగరాజులు పరామర్శించారు. ఆదివారం అర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామంలో అంగిరి ప్రదీప్ మాతృమూర్తి లక్ష్మీ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ప్రదీప్ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్, ప్రొఫెసర్ లింబద్రి, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, వ్యవసాయ శాఖ మెంబర్ గడుగు గంగాధర్, గెజిటెడ్ ఆఫీసర్ ఫోరమ్ అధ్యక్షుడు అలుక కిషన్, జిల్లా మాల మహానాడు నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.