28 June, 2026 | 1:48 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

మండలానికో ఎంఈవో

25-09-2024 03:05 AM

సీనియర్ హెచ్‌ఎంలకు అదనపు బాధ్యతలు

హైదరాబాద్, సెప్టెంబర్ 24(విజయక్రాంతి): ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి మండలానికి ఒక మండల విదాధికారి (ఎంఈవో)ని నియమించింది. మండల్ నోడల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న సీనియర్ హెచ్‌ఎంలకు ఎంఈవోలుగా అదనపు బాధ్యతలిస్తూ మంగళవారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రతి మండలానికి ఒక మండల విద్యాధికారిని నియమించడంతో పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. 2005లో చివరిసారిగా మండల విద్యాధికారులు పదోన్నతులు పొం దారు. ఆ తర్వాత ఉన్న వారికి, ఉపాధ్యాయులకు, పదవీ విరమణ పొందినవారికి బాధ్యతలు అదనంగా ఇస్తూ ఒక్కో జిల్లాలో ఎంఈవోకు ఆరు, ఏడు, ఎనిమిది, పది మండలాలు ఇన్‌చార్జీలుగా ఇస్తూ వచ్చారు.

దీంతో పర్యవేక్షణ కొరవడింది. రేవంత్‌రెడ్డి సర్కార్ విద్యావ్యవస్థను గాడి లో పెట్టేందుకు ఎంఎన్‌వోలకు అదనపు బాధ్యతలు ఇచ్చి మండలానికి ఒక అధికారి ఉండేలా చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.