పదోన్నతులతో ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలి
12-08-2026 01:37 AM
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రకారం ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ నిబంధనలు రూపొందించాలని, ఖాళీ గా ఉన్న ఎంఈవో, డిప్యూటీ ఈవో, డీఈవో, డైట్ లెక్చరర్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (జాక్టో) డిమాండ్ చేసింది.
పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ నవీన్ నికోలస్‌ను మంగళవారం జాక్టో నేతలు జి.సదానందం గౌడ్, కె.కృష్ణుడు, పర్వతి సత్యనారాయణ, రాజభాను చంద్రప్రకాష్, జట్టు గజేందర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎంఈవో పోస్టులను అప్‌గ్రేడ్ చేసి రాష్ట్రంలోని ఎడ్యుకేషన్ డివిజన్లను పునర్వ్యవస్థీకరించాలని కోరారు.






