దేవరకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంఈఓల సమావేశం
12-05-2026 06:43 PM
దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండ స్థానిక మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలలో భాగంగా దేవరకొండ డివిజన్ పరిధిలోని ఎంఈఓల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓలు కళాశాల వసతులు, వనరులు, అడ్మినిస్ట్రేషన్, అడ్మిషన్స్ తదితర అంశాలను పరిశీలించి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి మరియు కళాశాల సిబ్బంది పనితీరును అభినందించారు. అనంతరం కళాశాల ఎన్రోల్మెంట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వివిధ మండలాల ఎంఈఓలు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.






