12 May, 2026 | 7:51 PM

నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విచారణ జరపాలి

12-05-2026 06:46 PM

భైంసా,(విజయక్రాంతి): మే 3న దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష, NTA తప్పిదం వల్లన లీక్ అయ్యిందని దీనిపై విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దిగంబర్అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ  NTA  నిర్ధారించి పరీక్ష ను రద్దు చేయడం వల్లన 22 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ భవిష్యత్  అంకారంలోకి పోతుందని అన్నారు. దేశంలో పరీక్షలను కేంద్రం రాష్ట్రాల హక్కులను లాక్కుని విద్యా కేంద్రీకరణ వల్లన పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకుండా వరుసగా పేపర్ లీకులు అవుతున్నాయన్నారు.

గతంలో 2024 లో నీట్, నెట్ పరీక్షలు లీకై రద్దైనప్పుడే NTA పారదర్శకత, పరీక్షల నిర్వహణ లో అనేక అనుమానాలు ఉన్నాయని  సరిదిద్దుకోకుండా మళ్ళీ వరుసగా పేపర్ లీకులు జరిగాయన్నారు. ఎక్కడో ఒక రాష్ట్రంలో లీక్ అయితే దేశవ్యాప్తంగా పేపర్ లీక్ కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. అందుకే విద్యా వికేంద్రీకరణ చేయాలని, రాష్ట్రాల జాబితాలోని ఉన్న విద్యా హక్కులను కేంద్రం లాక్కొని కేంద్రీకరణ వలన అనేక విద్యార్థులు నష్టపోతున్నారని  తెలిపారు.