21 May, 2026 | 2:51 AM

మెడికల్ షాపుల బందు విజయవంతం

21-05-2026 01:50 AM

మహబూబాబాద్, మే 20 (విజయక్రాంతి): ఆలిండియా మెడికల్ అసోసి యేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లాలో మెడికల్ షాపుల బందు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. అత్యవసర వైద్య సేవలు అందించే ఆస్పత్రుల పరిధిలోని మెడికల్ షాపులు మినహా మిగిలిన అన్ని మెడికల్ షాపులు మూతపడ్డాయి.

తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని మెడికల్ షాపుల నిర్వాహకులు డిమాండ్ చేశారు. కేసముద్రం మండలంలో మెడికల్ షాపులు బంద్ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోఒలం శ్రీనివాస్, అసీమ్ అలీ, అలీ బాబా, భాస్కర్ రెడ్డి, వేణు, రాము, ఏకాంతం, ఎల్లయ్య,నరేష్, రాజు పాల్గొన్నారు.