29 June, 2026 | 2:01 AM

పకడ్బందీగా ఓటర్ జాబితా

29-06-2026 12:00 AM

బీఎల్‌ఓ ఎన్యుమరెషన్ పత్రాల  పంపిణీ ప్రక్రియను పరిశీలించిన ఆర్టీవో

ఎల్లారెడ్డి, జూన్ 28 (విజయ క్రాంతి): పారదర్శకమైన ఓటర్ జాబితా రూపొందించడం కోసమే కేంద్రీయ ఎన్నికల కమిషన్ ఎస్ ఐ ఆర్ ప్రక్రియ చేపట్టిందని ఎల్లారెడ్డి ఆర్టీవో ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని పోలింగ్ నెంబర్ 252 లో బి ఎల్ ఓ ఎన్యుమరెషన్ పత్రాల  పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎస్ ఐ ఆర్ సర్వే కోసం వచ్చే బిఎల్‌ఓ లకు సహకరించి పారదర్శకమైన ఓటర్ జాబితా  తయారీ కోసం సహకరించాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో  పారదర్శకమైన ఓటరు జాబితా అవసరమని అన్నారు. ఈ ప్రక్రియ జులై 24 వరకు కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బి ఎల్ ఓ స్వాతి తదితరులు పాల్గొన్నారు.