25 February, 2026 | 9:30 PM

చిక్కడు... దొరకడు

25-02-2026 12:00 AM

పత్తా లేని మెట్ పల్లి అబ్కారి సీఐ

సీఐ ఇంటికి తీసుకెళ్తున్న రోజువారి హాజరు రిజిస్టార్ 

గోడలపై సంతకాలు చేస్తున్న సిబ్బంది 

అర్జెంట్ గా అద్దె గది ఖాళీ చేసిన సీఐ 

స్థానికంగా ఉండని సిబ్బంది 

మెట్ పల్లి, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ఆవు చేలో మేస్తే దూడ గట్టున మెస్తుందా అన్నట్టు ఉన్నది. మెట్ పల్లి అబ్కారి కార్యాలయ ఉద్యోగుల పని తీరు. కార్యాలయ సీఐ గారు ఎప్పుడు మెట్ పల్లి వస్తారో, వెళ్తారో ఎవరికి తెలియదు. దింతో ఒక్క ఎస్‌ఐ స్థానికంగా ఉండగా,మిగతా కార్యాలయ ఉద్యోగు లు మొత్తం తమ ఇంటి నుండి ప్రతి రోజు విధులకు హాజరు అవుతు,స్థానికంగా నివా సం ఉండడం లేదు.దింతో అబ్కారి కార్యాలయం పరిధిలో గుడుంబా అమ్మకాలు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి.

ఇదే అధనుగా రెచ్చి పోయి కింది స్థాయి సిబ్బంది ఇద్దరు వసూళ్ల కార్యక్రమం చేపట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి.వివరాల్లోకి వెళ్తే మెట్ పల్లి అబ్కారి కార్యాలయం పరిధిలో మెట్ పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, కథలాపూర్ మండలాలు ఉన్నవి. వీటి పరిధిలో వైన్స్, బార్ల నిర్వహణను పర్యవేక్షణ చేస్తూ గుడుంబా, బెల్ట్ షా ప్ నియాత్రణను సంబంధిత అధికారులు చే పట్టాల్సి ఉంది.కాని ఉన్నతాధికారి విధులకు డుమ్మా కొడుతుండడం సిబ్బంది కి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక కొందరు ఇదే అదనుగా వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

మెట్ పల్లి అబ్కారి కార్యాలయం పరిధిలో మొత్తం ఆరు మండలాలకు గాను ఇరవై ఐదు వైన్స్, మెట్ పల్లి, కోరుట్ల పరిధిలో ఏడు బార్లు నడుస్తున్నా యి. ఇక మెట్ పల్లి కార్యాలయంలో ఒక సీ ఐ, ఇద్దరు ఎస్‌ఐ పోస్టులు ఉండగా సిఐ, ఒక ఎస్ ఐ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఎస్ ఐ పోస్ట్ ఖాళీగా ఉంది. రెండు హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఉండగా ఇద్దరు ఉండగా మరొకరు డిప్యూటేషన్ పై రాగ మొ త్తం ముగ్గురు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. అ లాగే మొత్తం ఎనిమిది మంది కానిస్టేబుల్ లు ఉండగావారిలో ఒకరు సెలవులో ఉన్నారు.

స్వంత వ్యాపారాల కోసం విధులకు డుమ్మా

మెట్ పల్లి సిఐ కి తన బంధువులతో కలిసి ఇతర వ్యాపారాలు ఉన్నట్టు తెలిసింది. దింతో ఆయన చుట్టపు చూపుగా విధులకు హాజరు అవుతూ తన వ్యాపారాలు చక్కబెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక రోజు వారి హాజరు సంతకాల కోసం నాలుగైదు రోజులకు ఒకసారి ఒక కానిస్టేబుల్ సిఐ ఇంటికి రిజిస్టర్ ను తీసుకెళ్లగా ఆ రిజిస్టార్ సిఐ తన వద్దే ఒక్కోసారి వారం రోజులు అట్టేపెట్టుకోవడం జరుగుతోంది .దింతో స్టేషన్ లో సి బ్బంది రోజు వారి సంతకాల కోసం ఇబ్బం ది పడుతున్నారు. రిజిస్టార్ లో సంతకాలు లేకుంటే తాము ఆఫీస్ లో విధులకు హాజరు కానట్టు అవుతుందని భావించిన కొందరు ఉద్యోగులు స్టాప్ రూమ్ గోడలపై సంతకాలు పెడుతూ విధులు నిర్వహిస్తున్నారు.

అర్జెంట్ గా అద్దె గది ఖాళీ చేశారు.

సుమారు రెండు సంవత్సరాలనుండి పట్టణ శివారులోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న సిఐ మూడు నెలల క్రి తం ఆకస్మాత్తుగా గది ఖాళీ చేయడం చర్చకు దారి తీసింది. అప్పటి నుండి పది, పదిహేను రోజులకు ఒకసారిమెట్ పల్లి కార్యాలయం లో విధులకు హాజరు అవుతున్నారు. ఏదైనా వివరణ కోసం విలేకరులు ఫోన్ చేసిన సిఐ, ఎస్‌ఐ లు ఫోన్ లిఫ్ట్ చేయరు.ఇక ఆ అధికారి అప్పుడప్పుడు విధులకు వచ్చేది నెల వారిగా వైన్స్, బార్ల నుండి వచ్చే మామూళ్ల కోసం మాత్రమేనని సంబంధిత శాఖ ఉద్యోగులు పేర్కొనడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి మెట్ పల్లి అబ్కారి కార్యాలయం ను చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.