పోలీసులను సొంతానికి వాడుకున్నది మీరే కదా?
- మీలాగ మేము దుర్వినియోగం చేయడంలేదు
- కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ చామల కౌంటర్
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాం తి) : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెపిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఎంపీ చామ ల మాట్లాడుతూ చట్టాల గురించి సీఎం రేవం త్ రెడ్డికి, డీజీపీ శివధర్ రెడ్డికి కేటీఆర్ చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. రెడ్ బుక్, పింక్ బుక్ , ఖాకీ బుక్ గురించి కేటీఆర్ మాట్లాడాల్సిన అవసరం లేదని, ఖాకీ బుక్ ఎప్పటికీ ఉంటుందని అన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో పోలీసులను ఏ విధంగా వాడుకున్నారో స్వంత మీ చెల్లి కవిత చెప్పిన విష యాన్ని మర్చిపోవద్దని ఆయన హితవు పలికా రు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని కవిత చెప్పిన ఆయన గుర్తు చేశారు. రెడ్ బుక్, పింక్ బుక్‌తో అధికారంలోకి వస్తామనే ఆలోచనలు కేటీఆర్ బంద్ చేయాలని చామల సూచించా రు. కేటీఆర్ లాగా మేము చట్టాన్ని చుట్టంలాగా వాడుకోవడం లేదని ఎంపీ చామల పేర్కొన్నారు.
మీ పదేళ్ల పాలన చూసి ప్రజలు మిమ్మల్ని పర్మినెంట్ గా ఇంటికి పంపించారని ఆయన విమర్శించారు. మీ లాగా పొలీసుల ను అధికార దుర్వినియోగం కోసం మేము వాడటం లేదన్నారు. రాజ్యాంగంపై మాకు పూర్తి నమ్మకం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేస్తుందని ఎంపీ చామ ల వెల్లడించారు.




