7 March, 2026 | 12:04 PM

మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ బాధ్యతల స్వీకరణ

07-03-2026 12:48 AM

మెట్ పల్లి, మార్చి 6,(విజయక్రాంతి): మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ గా శుక్రవారం మైలారపు లింబాద్రి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెట్ పల్లి పట్టణంలో మౌళిక వసతులతో పాటు అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సరిస్తానని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి కమిషనర్ స్పందన, ఆర్య వైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు మైలారపు రాంబాబు, వైస్ చైర్మన్ ఒంకార్ నవీన్,కౌన్సిలర్ లు బత్తుల నరేష్, ముదిగొండ నరేష్, పందిరి రమేష్, రెబ్బాస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.