24 June, 2026 | 1:03 PM

Breaking News

నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •   ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం   •   నేషనల్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఉప్పరపల్లిలో ఆస్తి వివాదం.. కన్న తండ్రిపై కుమారుడు దాడి   •   బీజేపీ కుట్ర చేసే ప్రమాదం.. SIR ప్రక్రియలో బీఎల్ఏలే కీలకం   •   కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..! 10 రోజులే సమయం   •   గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు పరిపాలన అనుమతి   •  

మంగ్లీ తమ్ముడికి మైక్రో ఫైనాన్స్ డబ్బులు!

01-05-2026 12:43 AM
  1. ప్రధాన నిందితుడు రమావత్ మధు ఖాతా నుంచి మూడుసార్లు బదిలీ
  2. బదిలీ అయిన మరుసటి రోజే విత్‌డ్రా
  3. సైబరాబాద్ పోలీసుల విచారణలో గుర్తింపు
  4. మధు, హిమకాంత్‌రెడ్డి, శివ ఖాతాల పూర్తి ఆధారాల కోసం బ్యాంకులకు లేఖలు

సికింద్రాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): రాష్ర్టంలో సంచలనం సృష్టి స్తున్న మైక్రో ఫైనాన్స్ స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెపుతున్న సింగర్ మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతా లావాదేవీల కీలక ఆధారాలను సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ కేసు లో ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధు బ్యాంకు ఖాతా నుంచి శివ చౌహాన్ ఖాతాకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు.

మొత్తం మూడు వి డతల్లో నగదు బదిలీ కాగా.. జమ అ యిన తర్వాతి రోజే ఆ నగదును విత్ డ్రా చేసినట్లు బ్యాంక్ స్టేట్మెంట్ల ద్వారా స్పష్టమైంది. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రధాన నిందితుడు రమావత్ మధు బ్యాంకు ఖాతాను సీజ్ చేసి న పోలీసు అధికారులు.. పూర్తి వివరా ల కోసం బ్యాంక్ యాజమాన్యాలకు లేఖలు రాశారు. మధుతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమకాంత్‌రె డ్డి, శివ చౌహాన్‌ల బ్యాంక్ ఖాతాల స్టే ట్మెంట్లు, నగదు లావాదేవీల పూర్తి ని వేదికను ఇవ్వాలని పేర్కొన్నారు.

అయి తే ఈ కేసులో తమకు ఎలాంటి సం బంధం లేదని మంగ్లీ, శివ చౌహాన్ ఇ ప్పటికే మీడియా వేదికగా ప్రకటించారు. కానీ పోలీసుల విచారణలో శివ ఖాతాకు నిందితుడి ఖాతా నుంచి నగ దు బదిలీ బదిలీ అయినట్లు పోలీసుల విచారణలో తేలడంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రజల నుంచి అధిక వడ్డీ ఆశ చూపి వసూలు చేసిన సొమ్ము ఎక్కడికి మళ్లించారు? ఈ వ్యవహారంలో వెనుక ఉండి నడిపించిదెవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.